BREAKING
చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి.. ప్రజాసేవలో ముందుండాలి సోనీ నుంచి సరికొత్త ఎఫ్‌ఎక్స్5 సినిమా కెమెరా ఇంద్రకీలాద్రిపై పవిత్ర వృక్షాల పెంపునకు శ్రీకారం నేటి పంచాంగం 10 నవంబర్, 2026 అమ్మవారి అన్నదానానికి రూ.2.50 లక్షల విరాళం నూతన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందనలు అమరేశ్వర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్‌లో జోషితకు స్వర్ణం నేటి రాశి ఫలాలు 10 నవంబర్, 2026 మచిలీపట్నంలో ఈనెల 10న జాబ్‌మేళా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ డీకే బాలాజీ ఇద్దరు చిన్నారులను దత్తత తల్లిదండ్రులకు అప్పగించిన కలెక్టర్ హోంగార్డు కుటుంబానికి రూ.10.62 లక్షల బీమా ప్రజల నమ్మకానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలు : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఎన్డీఏ కూటమికి ప్రజల అఖండ మద్దతు... - మరో 20 ఏళ్లు అధికారం మాదే... ఎంపీ కేశినేని చిన్ని

ఇంద్రకీలాద్రిపై శాస్త్రోక్తంగా ఆకాశ దీపం ఏర్పాటు

Select Suryaa Now
ఇంద్రకీలాద్రిపై శాస్త్రోక్తంగా ఆకాశ దీపం ఏర్పాటు

ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్ : పరాభవ నామ సంవత్సర కార్తీక మాస ప్రారంభాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం ప్రదోష వేళ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆకాశ దీపం ఏర్పాటు కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కనకదుర్గమ్మ, మల్లేశ్వర స్వామివార్ల సన్నిధులతో పాటు నటరాజ స్వామివారి ఆలయంలో స్థానాచార్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో ప్రదోష వేళ ఆకాశ దీపాన్ని దర్శించుకోవడం వల్ల సర్వపాపాలు నశించి, అకాల మృత్యు భయాలు తొలగిపోవడంతో పాటు సమస్త శుభాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని అర్చక స్వాములు తెలిపారు. సకల లోకాలకు శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ శాస్త్రోక్తంగా వెలిగించిన దివ్య దీపాన్ని ఆలయ ధ్వజస్తంభానికి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై నిత్యం నిర్వహించే విశేష అభిషేకాలు, బిల్వార్చనలు, లక్ష్మీ గణపతి పంచాక్షరీ పారాయణాలు తదితర వైదిక సేవల్లో భక్తులు పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో శీనా నాయక్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.