BREAKING
చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి.. ప్రజాసేవలో ముందుండాలి సోనీ నుంచి సరికొత్త ఎఫ్‌ఎక్స్5 సినిమా కెమెరా ఇంద్రకీలాద్రిపై పవిత్ర వృక్షాల పెంపునకు శ్రీకారం నేటి పంచాంగం 10 నవంబర్, 2026 అమ్మవారి అన్నదానానికి రూ.2.50 లక్షల విరాళం నూతన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందనలు అమరేశ్వర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్‌లో జోషితకు స్వర్ణం నేటి రాశి ఫలాలు 10 నవంబర్, 2026 మచిలీపట్నంలో ఈనెల 10న జాబ్‌మేళా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ డీకే బాలాజీ ఇద్దరు చిన్నారులను దత్తత తల్లిదండ్రులకు అప్పగించిన కలెక్టర్ హోంగార్డు కుటుంబానికి రూ.10.62 లక్షల బీమా ప్రజల నమ్మకానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలు : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఎన్డీఏ కూటమికి ప్రజల అఖండ మద్దతు... - మరో 20 ఏళ్లు అధికారం మాదే... ఎంపీ కేశినేని చిన్ని

దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్‌లో జోషితకు స్వర్ణం

Select Suryaa Now
దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్‌లో జోషితకు స్వర్ణం

పెనమలూరు, మేజర్ న్యూస్ : కానూరులోని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌కు చెందిన బీటెక్ కంప్యూటర్ సైన్స్ మూడో సంవత్సరం విద్యార్థిని కొగంటి జోషిత దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్–2026లో బంగారు పతకం సాధించారు. మహిళల 84 కేజీలకు పైబడిన విభాగంలో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఆమె మొత్తం 395 కిలోల బరువును ఎత్తి విజేతగా నిలిచారు. ఇందులో స్క్వాట్‌లో 162.5 కిలోలు, బెంచ్ ప్రెస్‌లో 77.5 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 155 కిలోలు ఎత్తారు. జోషిత విజయంపై సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు ఎం. రాజయ్య, కార్యదర్శి పి. లక్ష్మణరావు, కోశాధికారి ఎస్. వెంకటేశ్వరరావు, ఉపకులపతి ప్రొఫెసర్ పి. వెంకటేశ్వరరావు, సహ ఉపకులపతి డాక్టర్ ఎ.వి. రత్నప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. రవిచంద్, ఫిజికల్ డైరెక్టర్లు పి. రఘు, లక్ష్మీ సౌజన్య అభినందించారు. ఆమె ప్రతిభ, క్రీడల పట్ల అంకితభావం విశ్వవిద్యాలయానికి, రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొంటూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.