BREAKING
చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి.. ప్రజాసేవలో ముందుండాలి సోనీ నుంచి సరికొత్త ఎఫ్‌ఎక్స్5 సినిమా కెమెరా ఇంద్రకీలాద్రిపై పవిత్ర వృక్షాల పెంపునకు శ్రీకారం నేటి పంచాంగం 10 నవంబర్, 2026 అమ్మవారి అన్నదానానికి రూ.2.50 లక్షల విరాళం నూతన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందనలు అమరేశ్వర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్‌లో జోషితకు స్వర్ణం నేటి రాశి ఫలాలు 10 నవంబర్, 2026 మచిలీపట్నంలో ఈనెల 10న జాబ్‌మేళా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ డీకే బాలాజీ ఇద్దరు చిన్నారులను దత్తత తల్లిదండ్రులకు అప్పగించిన కలెక్టర్ హోంగార్డు కుటుంబానికి రూ.10.62 లక్షల బీమా ప్రజల నమ్మకానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలు : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఎన్డీఏ కూటమికి ప్రజల అఖండ మద్దతు... - మరో 20 ఏళ్లు అధికారం మాదే... ఎంపీ కేశినేని చిన్ని

మచిలీపట్నంలో ఈనెల 10న జాబ్‌మేళా

Select Suryaa Now
మచిలీపట్నంలో ఈనెల 10న జాబ్‌మేళా

మచిలీపట్నం మేజర్ న్యూస్ : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు మచిలీపట్నంలోని దిమ్మల సెంటర్, ప్రభుత్వ వైద్య కళాశాల రోడ్డు వద్ద జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ జాబ్‌మేళాలో యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, టెక్నోటాస్క్ బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, బంధన్ బ్యాంక్ లిమిటెడ్, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెడ్‌ప్లస్, టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్, ముత్తూట్ మనీ లిమిటెడ్, అడెక్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎల్విన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, డైకిన్ తదితర ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయని, 400కు పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అధికారి వై. సత్యబ్రహ్మం తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసిన 18 నుంచి 35 ఏళ్లలోపు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి మంచి వేతనంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.inవెబ్‌సైట్‌లో పూర్తి వివరాలతో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. జాబ్‌మేళాకు హాజరయ్యే సమయంలో రెజ్యూమ్ లేదా బయోడేటాతో పాటు ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన ఫోన్ నంబర్, పాన్ కార్డు, విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులు తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99664 89796, 96665 43412, 97042 16211 నంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం నియోజకవర్గం, కృష్ణాజిల్లా.