అమరేశ్వర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు
పెనమలూరు, మేజర్ న్యూస్ : కానూరులోని వి.ఆర్. సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల 2026 బ్యాచ్ మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి జె.టి. అమరేశ్వర్ ఐఎస్‌టీఈ ఆంధ్రప్రదేశ్ విభాగం ప్రకటించిన 2026 రాష్ట్రస్థాయి ఉత్తమ మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి అవార్డును గెలుచుకున్నారు. నవంబర్ 7న విశాఖపట్నంలోని నదింపల్లి సత్యనారాయణ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆయనకు పతకం, ప్రశంసాపత్రం అందజేశారు. ఐఎస్‌టీఈ రాష్ట్ర విభాగం నిర్వహణ కమిటీ అమరేశ్వర్ పేరును ఈ అవార్డుకు సిఫారసు చేయడం విశేషం. ఈ విజయంపై ఉపకులపతి డాక్టర్ పరుచూరి వేంకటేశ్వరరావు, ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏ.వి. రత్నప్రసాద్ అభినందనలు తెలిపారు. మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ నర్రా రవికుమార్, డీన్ వెంకట్రావు, రిజిస్ట్రార్ రవిచంద్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అమరేశ్వర్‌ను ఘనంగా సన్మానించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.