BREAKING
చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి.. ప్రజాసేవలో ముందుండాలి సోనీ నుంచి సరికొత్త ఎఫ్‌ఎక్స్5 సినిమా కెమెరా ఇంద్రకీలాద్రిపై పవిత్ర వృక్షాల పెంపునకు శ్రీకారం నేటి పంచాంగం 10 నవంబర్, 2026 అమ్మవారి అన్నదానానికి రూ.2.50 లక్షల విరాళం నూతన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందనలు అమరేశ్వర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్‌లో జోషితకు స్వర్ణం నేటి రాశి ఫలాలు 10 నవంబర్, 2026 మచిలీపట్నంలో ఈనెల 10న జాబ్‌మేళా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ డీకే బాలాజీ ఇద్దరు చిన్నారులను దత్తత తల్లిదండ్రులకు అప్పగించిన కలెక్టర్ హోంగార్డు కుటుంబానికి రూ.10.62 లక్షల బీమా ప్రజల నమ్మకానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలు : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఎన్డీఏ కూటమికి ప్రజల అఖండ మద్దతు... - మరో 20 ఏళ్లు అధికారం మాదే... ఎంపీ కేశినేని చిన్ని

ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ డీకే బాలాజీ

Select Suryaa Now
ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం మేజర్ న్యూస్ : జిల్లాలో మూడు దశల్లో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్‌తో కలిసి జిల్లా పంచాయతీ అధికారి, ఆర్డీవోలు, డీఎల్‌డీఓలు, ఇతర అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు, నామినేషన్ల స్వీకరణ, సిబ్బంది నియామకం, శిక్షణ తదితర అంశాలను సమీక్షించారు. ఓటర్ల వివరాలు, వార్డుల వారీగా ఓటర్ల విభజనలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. ఒక వార్డుకు చెందిన ఓటర్లు మరో వార్డులో లేదా సంబంధం లేని పోలింగ్ కేంద్రంలో నమోదుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హామ్లెట్లు, ప్రధాన గ్రామాల పరిధిలో ఓటర్ల విభజన సక్రమంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) వ్యక్తిగతంగా సందర్శించి భవనాల స్థితిగతులు, పోలింగ్ నిర్వహణకు అవసరమైన వసతులను పరిశీలించాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, దెబ్బతిన్న రేకుల షెడ్లు, వసతులు లేని కేంద్రాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నివేదిక ఇవ్వాలన్నారు. పోలింగ్ కేంద్రాల అనుకూలతపై ఎంపీడీఓలు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని, కేంద్రాల మార్పులకు నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకుని రాజకీయ పార్టీలకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. మూడు దశల ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సుల సంఖ్యను మండలాల వారీగా అంచనా వేసి, అందుబాటులో ఉన్నవి, అదనంగా కావాల్సిన వాటి వివరాలతో ప్రణాళిక రూపొందించాలన్నారు. మొదటి దశ ఎన్నికలకు ప్రాధాన్యతనిస్తూ, మూడో దశకు కేటాయించిన బాక్సులను అవసరమైతే మొదటి దశకు తరలించాలని, అనంతరం దశలవారీగా సర్దుబాటు చేయాలని సూచించారు. సమీప మండలాల మధ్యే బాక్సుల తరలింపు జరిగేలా మార్గ ప్రణాళిక రూపొందించి, ప్రతి బాక్సు తరలింపు వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలన్నారు. బ్యాలెట్ బాక్సుల మరమ్మతులు, నిర్వహణ పూర్తి చేసి వినియోగానికి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అభ్యర్థుల తుది జాబితా, గుర్తుల కేటాయింపు ప్రకారం బ్యాలెట్ పేపర్ల ముద్రణ చేపట్టాలని, చివరి నిమిషంలో మార్పులు వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల విధులకు అవసరమైన రూట్, జోనల్ అధికారులతో పాటు ఇతర సిబ్బందిని అన్ని శాఖల నుంచి సమర్థవంతంగా నియమించి, వారికి బాధ్యతలపై స్పష్టమైన అవగాహన కల్పించేలా శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో ఎం. శ్రీహరి, బందరు, గుడివాడ ఆర్డీవోలు కే. సాంబశివరావు, జి. బాలసుబ్రమణ్యం, జిల్లా పంచాయతీ అధికారి, డీఎల్‌డీఓలు పి. శ్రీనివాస్, సునీత శర్మ, పి. స్వర్ణలత, ఇతర ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.