BREAKING
అంబాజీపేట ఎంపీపీ రేసులో అనంతలక్ష్మి తులసి భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి బిక్కవోలులో జనసేనకు 100 శాతం విజయం. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కళ్యాణి ఎంపిక. ఎం.డి.ఆర్.టి. అర్హత సాధించిన కర్రీ అజయ్ రెడ్డి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు చిట్యాల విద్యార్థులు ఎంపిక కళ చెదిరింది రైతుకు కన్నీరే మిగిలింది బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి కె.గంగవరంలో తుఫాన్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సిబ్బంది తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి.. జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు.. మిరియాల వెంకట్రావుకు ఘన నివాళులు

ప్రజల నమ్మకానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలు : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్

Select Suryaa Now
ప్రజల నమ్మకానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలు : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్

ఉయ్యూరు మేజర్ న్యూస్ : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లలో ఎన్డీఏ కూటమికి లభించిన ఘన విజయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న కృషికి ప్రజలు ఇచ్చిన ప్రతిఫలమని మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్, 7, 22వ వార్డుల జనసేన కౌన్సిలర్లు మెరుగు చిన్న కోటయ్య, ఘంటా దుర్గాభవాని, ఎస్సీ కాలనీలకు చెందిన 8, 9, 10వ వార్డుల టీడీపీ కౌన్సిలర్లు కొలగాని సునీత, పరిమి సంతోషి సలోమి, కలకట్ల డాలీ, వీరమ్మతల్లి ఆలయ కమిటీ సభ్యులు సోమవారం ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ వారిని అభినందించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లలో కూటమికి ప్రజలు అందించిన విజయం ప్రభుత్వంపై వారికున్న నమ్మకానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారని, అందుకే ప్రజలు కూటమికి ఘన విజయాన్ని అందించారని పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ అజ్మతుల్లా, వీరమ్మతల్లి ఆలయ కమిటీ సభ్యులు బొగ్గవరపు శ్రీనివాసరావు, శ్రీనివాస్, ఖాసిం, ఘంటా రామ్మోహన్, కొలగాని సాంబశివరావు, పరిమి సజిత్, భాగ్యరాజ్, వీరబాబు, సలీం, బాజాని తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు, కృష్ణాజిల్లా.