BREAKING
చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి.. ప్రజాసేవలో ముందుండాలి సోనీ నుంచి సరికొత్త ఎఫ్‌ఎక్స్5 సినిమా కెమెరా ఇంద్రకీలాద్రిపై పవిత్ర వృక్షాల పెంపునకు శ్రీకారం నేటి పంచాంగం 10 నవంబర్, 2026 అమ్మవారి అన్నదానానికి రూ.2.50 లక్షల విరాళం నూతన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందనలు అమరేశ్వర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్‌లో జోషితకు స్వర్ణం నేటి రాశి ఫలాలు 10 నవంబర్, 2026 మచిలీపట్నంలో ఈనెల 10న జాబ్‌మేళా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ డీకే బాలాజీ ఇద్దరు చిన్నారులను దత్తత తల్లిదండ్రులకు అప్పగించిన కలెక్టర్ హోంగార్డు కుటుంబానికి రూ.10.62 లక్షల బీమా ప్రజల నమ్మకానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలు : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఎన్డీఏ కూటమికి ప్రజల అఖండ మద్దతు... - మరో 20 ఏళ్లు అధికారం మాదే... ఎంపీ కేశినేని చిన్ని

చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి.. ప్రజాసేవలో ముందుండాలి

Select Suryaa Now
చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి.. ప్రజాసేవలో ముందుండాలి

మచిలీపట్నం మేజర్ న్యూస్ : చదువుకున్న యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో కీలక బాధ్యతలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఆ దిశగా 29 ఏళ్ల వయసులోనే మచిలీపట్నం మేయర్‌గా ఎన్నికైన ఇంజినీరింగ్ పట్టభద్రురాలు, ముస్లిం మైనారిటీ యువతి అబ్దుల్ అబిదా విజయాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. యువత రాజకీయాల్లోకి రావాలన్న తన ఆలోచనకు అబ్దుల్ అబిదా నిలువెత్తు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యావంతురాలైన యువతి నగర ప్రథమ పౌరురాలిగా బాధ్యతలు చేపట్టడం శుభపరిణామమని పేర్కొంటూ ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అదేవిధంగా మైనారిటీ వర్గాల అభ్యున్నతికి, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీం బేగ్ సేవలను కూడా చంద్రబాబు అభినందించారు. గతంలోనూ పలు సందర్భాల్లో డాక్టర్ హసీం బేగ్ నిబద్ధత, నాయకత్వ పటిమను ముఖ్యమంత్రి ప్రశంసించారు. తాజాగా మచిలీపట్నం మేయర్‌గా అబ్దుల్ అబిదా భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ఆమెతో పాటు డాక్టర్ హసీం బేగ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం నియోజకవర్గం, కృష్ణాజిల్లా.