కాంగ్రెస్ మండల మైనార్టీ అధ్యక్షుడిగా సులేమాన్
రామాయంపేట ; నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడిగా సులేమాన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ వెల్లడించారు.ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన మైనార్టీ సెల్ అధ్యక్షుడు సులేమాన్‌తో పాటు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.