ఎంపీ రఘునందన్ రావుకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేత:
కొల్చారం ; ..మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి కొల్చారం గ్రామానికి చెందిన పల్వంచ సబిత శ్రీధర్ గౌడ్ దంపతుల కుమార్తె వివాహ శుభకార్యానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు ని వివాహ వేడుకకు హాజరుకావాలని ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను స్వీకరించిన ఎంపీ కి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పల్వంచ రాజేందర్ గౌడ్, మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, కొల్చారం మండల బీజేపీ అధ్యక్షులు పంతులు హరీష్ తదితరులు పాల్గొన్నారు.