పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రొసీడింగ్స్ అందజేత
కొల్చారం ; ..మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో పూరి గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు గ్రామ సర్పంచ్ దయాకర్ గౌడ్ ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్స్అందజేశారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన చాకలి పద్మ, గుండు గంగమ్మ, జలగం ఎల్లమ్మ, మసీదుపల్లి నాగరాణి లకు నూతన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రొసీడింగ్స్ అందజేశారు.
అదేవిధంగా పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన చాకలి యశోదకు కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కును అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.