BREAKING
అంబాజీపేట ఎంపీపీ రేసులో అనంతలక్ష్మి తులసి భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి బిక్కవోలులో జనసేనకు 100 శాతం విజయం. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కళ్యాణి ఎంపిక. ఎం.డి.ఆర్.టి. అర్హత సాధించిన కర్రీ అజయ్ రెడ్డి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు చిట్యాల విద్యార్థులు ఎంపిక కళ చెదిరింది రైతుకు కన్నీరే మిగిలింది బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి కె.గంగవరంలో తుఫాన్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సిబ్బంది తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి.. జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు.. మిరియాల వెంకట్రావుకు ఘన నివాళులు

ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్‌కు దళిత నాయకుల సత్కారం

Select Suryaa Now
ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్‌కు దళిత నాయకుల సత్కారం

ఉయ్యూరు మేజర్ న్యూస్ : సామాన్య కుటుంబానికి చెందిన దళిత వర్గాల నాయకుడు చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్‌కు ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్‌గా అవకాశం దక్కడం పట్ల పట్టణ దళిత నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రవీణ్ కుమార్‌ను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అలాగే 8, 9, 10వ వార్డులకు చెందిన కౌన్సిలర్లను సైతం సన్మానించి అభినందనలు తెలిపారు. సామాన్య కార్యకర్తలకు, దళిత వర్గాలకు రాజకీయంగా అవకాశాలు కల్పించడం ప్రజాస్వామ్యంలో శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అధిష్ఠానానికి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు, మాజీ ఎమ్మెల్యే వై.వి.బి. రాజేంద్రప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఉయ్యూరు గణేష్, పచ్చిగళ్ళ కోటేశ్వరరావు, పులిపాక ప్రభుదాస్, మట్టా యేషోబ్, ఉయ్యూరు ఎలియాసర్, కొడాలి రమేష్, గలంకి శోభన్, వల్లూరు యేసు చంద్రరావు, పచ్చిగళ్ళ పిచ్చయ్య, మట్టా నవీన్, కాకాని ఆమోస్, మట్టా నాని, కలపాల సిద్దు తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.