BREAKING
అంబాజీపేట ఎంపీపీ రేసులో అనంతలక్ష్మి తులసి భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి బిక్కవోలులో జనసేనకు 100 శాతం విజయం. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కళ్యాణి ఎంపిక. ఎం.డి.ఆర్.టి. అర్హత సాధించిన కర్రీ అజయ్ రెడ్డి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు చిట్యాల విద్యార్థులు ఎంపిక కళ చెదిరింది రైతుకు కన్నీరే మిగిలింది బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి కె.గంగవరంలో తుఫాన్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సిబ్బంది తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి.. జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు.. మిరియాల వెంకట్రావుకు ఘన నివాళులు

రంగంపేటలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Select Suryaa Now
రంగంపేటలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

కొల్చారం ...కొల్చారం మండల రంగంపేట గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడు గొండ కృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల మల్లేశం గౌడ్ హాజరై కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ మాట్లాడుతూ పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ అభివృద్ధి ప్రదాతగా ప్రజాపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని కోరుకున్నారు.