నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి
గోలి శ్రీనివాస్ రెడ్డి
ఆమనగల్లు రంగారెడ్డి:
నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి అని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సోమవారం ఆమనగల్లు మండలం మంగళ్ కుంట తండా చెందిన బాలుడికి మంజూరైన 20వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును బాధితుని కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా పేద, మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్య పరిరక్షణకు, అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉందని, అనారోగ్య బాధితులు ముఖ్యమంత్రి సహాయనిధినిసద్వినియోగం చేసుకోవాలని గోలి శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఆయన సహకారంతో మంజూరైన చెక్కును హైదరాబాదులోని ఆయన నివాసంలో బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు విజయ్ గౌడ్, అనిల్ కుమార్, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.