సమస్యల పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందించిన ఉపాధ్యాయులు
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని జేసీకి వినతి పత్రం.
సూర్య న్యూస్ దర్శి.
స్థానిక సంస్థల ఎన్నికలలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారికి ఉపాధ్యాయులు వినతి పత్రం అందజేశారు
ఉపాధ్యాయులకు రాబోయే గ్రామీణ పంచాయితీ ఎన్నికలలో స్పెషల్ కేటగిరి ఉపాధ్యాయులకు 60 సంవత్సరాలు పైబడిన ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని,
ఇటీవల జరిగిన జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలలో డ్యూటీ చేసిన ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన రెన్యూమిరేషన్ వెంటనే చెల్లించాలని,కొన్ని మండలాలలో ఎంపీడీవోలు 450/- మాత్రమే చెల్లించడం, మొదలగు ఆర్థిక అంశాలను ఎన్నికల నిబంధన మేరకు చెల్లించాలని కోరారు.
రాబోయే గ్రామీణ పంచాయతీ ఎన్నికలలో పాల్గొన్న సిబ్బందికి మరుసటి రోజు ఓడి సౌకర్యం కల్పించాలని , మరికొన్ని సమస్యల మీద జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి కి ప్రకాశం జిల్లా ఫ్యాప్టో పక్షాన ఉపాధ్యాయుల వినతిపత్రం అందజేశారు.