ఇంపార్చ్‌మెంట్ ముప్పును తోసిపుచ్చిన రక్షణ కార్యదర్శి పెట్ హెగ్‌సెత్
సూర్య అంతర్జాతీయ డెస్క్: తనపై వస్తున్న అభిశంసన (ఇంపార్చ్‌మెంట్) ముప్పును అమెరికా రక్షణ కార్యదర్శి పెట్ హెగ్‌సెత్ (Pete Hegseth) తేలికగా కొట్టిపారేశారు. పెంటగాన్‌లో తాను చేపట్టిన విధానాలు మరియు తన అధికారిక రికార్డును సమర్థించుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రతినిధుల సభలో తనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
అభిశంసన తీర్మానాన్ని తిప్పికొట్టడానికి కాంగ్రెస్‌లో తగినంత రిపబ్లికన్ల మద్దతు ఉందా అనే అంశంపై స్పందిస్తూ, తాము దీని గురించి ఎటువంటి ఆందోళన చెందడం లేదని హెగ్‌సెత్ పేర్కొన్నారు. అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్ ప్రతినిధి థామస్ మాస్సీ తనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో రక్షణ కార్యదర్శి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ లబ్ధికోసం లేదా అవాస్తవ ఆరోపణలతో కొందరు నేతలు ముందుకు వస్తున్నారని, వాటిని ఎదుర్కొనేందుకు వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.
దేశ భద్రతా విధానాలు మరియు సైనిక సంస్కరణల అమలులో భాగంగా తను తీసుకున్న నిర్ణయాలపై పూర్తి స్పష్టత ఉందని హెగ్‌సెత్ తెలిపారు. మరోవైపు మధ్యంతర ఎన్నికల ఫలితాలు మరియు విదేశీ విధానాలపై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న విమర్శల నేపథ్యంలో ట్రంప్ యంత్రాంగంపై రాజకీయ ఒత్తిళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రక్షణ శాఖ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే, ప్రత్యర్థుల విమర్శలను ధీటుగా ఎదుర్కొంటామని ఆయన పునరుద్ఘాటించారు.