సి.ఎం. పదవికే వన్నె తెచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పాల్వంచ, సూర్య(మేజర్ న్యూస్)- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ, సి.ఎం. పదవికే వన్నె తెచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని డిసిఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం పాల్వంచలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబురాలు జరిపారు. పాల్వంచ అయ్యప్ప నగర్ లోని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో బర్త్ డే కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు. రేవంత్ రెడ్డికి బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ పాల్వంచలో ఫ్లెక్సీలు కట్టారు.ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ భారతదేశంలోనే గుర్తింపుగల, పేరొందిన సి.ఎం. రేవంత్ రెడ్డి అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆదేశాలను తూ.చ. తప్పకుండా, పార్టీ బలపడడానికి ఎంతగానో కృషి చేస్తున్న వ్యక్తి రేవంత్ అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన బి.ఆర్.ఎస్., బి.జె.పి. పార్టీల కామెంట్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, వారికి బుద్ధి చెబుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని కొత్వాల అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు, కార్పొరేటర్ కాల్వ భాస్కర్ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహీపతి రామలింగం, కొండం వెంకన్నగౌడ్, సాదం రామకృష్ణా రావు, నరిగె సుజాత, పైడిపల్లి మహేష్, వై. వెంకటేశ్వరరావు, చింతా నాగరాజు, డిష్ నాగశ్వరరావు, వాసుమల్ల సుందర్ రావు, కొమర్రాజు విజయ్, డప్పు రాము, షేక్ షఫీ, దర్మసోత్ ఉపేందర్ నాయక్, పాకాలపాటి రోశయ్య చౌదరి, షేక్ దస్తగిరి, షేక్ బాషా, షేక్ మదార్, ఆటో మల్లికార్జున్, కటుకూరి శేఖర్, లోగాని రామకృష్ణ, పట్టా వీరకుమార్, ఇంజా దుర్గారావు (బాబి), బూసి శ్రీను, బండి నాగరాజు, కె. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.