108 ఆంబులెన్స్ ల ఆకస్మిక తనిఖీ
జిన్నారం గుమ్మడిదల ఉమ్మడి మండలాల్లోని 108 అంబులెన్సులను సంగారెడ్డి జిల్లా మేనేజర్ మెరుగు నరేష్ యాదవ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్సుల్లో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, మందుల నిల్వలు, వాహనాల పనితీరు, నిర్వహిస్తున్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర సమయాల్లో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర కాల్ వచ్చిన 30 సెకన్లలోనే అంబులెన్స్ బయలుదేరాలని స్పష్టం చేశారు. వాహనాల్లో అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించారు. అలాగే పీఎం రహత్ పథకంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించడంలో 108 సిబ్బంది కీలక పాత్ర పోషించాలని, విధుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజలకు నాణ్యమైన అత్యవసర సేవలు అందించాలని జిల్లా మేనేజర్ సూచించారు. కార్యక్రమంలో అంబులెన్స్ పైలెట్లు సిబ్బంది పాల్గొన్నారు.
జిన్నారం రిపోర్టర్ యు .చంద్రశేఖర్