BREAKING
ప్రజావాణికి ఒకే ఒక్క దరఖాస్తు ఎంపీడీవో జయరాం విజయ్ నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి ఆంత్రోపిక్‌కు షాక్...'క్లాడ్' సబ్‌స్క్రిప్షన్ మార్కెటింగ్ వివాదంపై కోర్టులో కొనసాగనున్న వ్యాజ్యం ఫ్రాన్స్‌లో స్మార్ట్ రిఫ్రిజిరేటర్లపై సైబర్ దాడి కలకలం హరిత భవిష్యత్తుకు గ్రిడ్లు, ఫైనాన్స్, ఉద్యోగ కల్పనే కీలకం అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగ భయాలు డ్రోన్ ముప్పును తిప్పికొట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం అమెరికాలో హోండా ఓహియోలో రూ.25 వేల కోట్లతో కొత్త ఆటో ప్లాంట్ కుంభ రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani పోలాండ్‌లోని క్రాకోవ్ నగరంలో కాల్పుల ఘటన...దిగ్భ్రాంతిలో దేశ ప్రజలు ఈయూ బడ్జెట్‌లో పర్యవేక్షణ తగ్గిస్తే సహించేది లేదు యంగ్ హీరో రోషన్ మేకతో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ క్రేజీ ప్రాజెక్ట్.. జటాయుగా రానున్న విజువల్ వండర్ యూరోపియన్ యూనియన్ నుంచి యూనిక్రెడిట్‌కు ఊరట మీన రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani దేశవ్యాప్తంగా ఘనంగా ‘దీపావళి స్నేహ్ మిలన్’

బొగ్గు ఉత్పత్తిలో లక్ష్యాలను అధిగమించాలి

Select Suryaa Now
బొగ్గు ఉత్పత్తిలో లక్ష్యాలను అధిగమించాలి

 

కొత్తగూడెం సింగరేణి, సూర్య(మేజర్ న్యూస్)- కొత్తగూడెం ఏరియాలో పర్యటించిన సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్) బాధావత్ వెంకన్న, సోమవారం కొత్తగూడెం ఏరియాలోని వీకే కోల్ మైన్స్, ఆర్‌సీహెచ్‌పీలను సంబంధిత అధికారులు, విభాగాధిపతులతో కలిసి పర్యటించారు. వారితో పాటు ఏరియా జీఎం సిహెచ్. వెంకటరమణ పాల్గొన్నారు.
వీకే కోల్ మైన్స్‌కు వెళ్లి వ్యూ పాయింట్ నుండి ఓబీ (మట్టి తొలగింపు) పనులను వీక్షించి, త్వరితగతిన మట్టి తొలగింపు పనులను పూర్తి చేసి బొగ్గు ఉత్పత్తిని చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తిని సాధించుటకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మెరుగైన బొగ్గు ఉత్పత్తిని చేయుటకు కావాల్సిన చర్యలు చేపట్టాలన్నారు.ఈ సందర్భంగా జీఎం వీకే ఓ.సి. ప్రాజెక్టు ఉపరితల మైన్ వివరాలను, వాటి రికార్డులను వివరించారు. అలాగే రోజువారీ బొగ్గు ఉత్పత్తి మరియు రవాణా, ఓబీ బ్లాస్టింగ్, లోడింగ్ పనులను జీఎం సిహెచ్. వెంకటరమణను అడిగి తెలుసుకున్నారు.బొగ్గు నాణ్యతను పరిశీలించి వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, బొగ్గు ఉత్పత్తి మరియు రవాణా రోజువారీ లక్ష్యాలను అధిగమించి, రవాణాకు ఎటువంటి ఆటంకములు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలతో బొగ్గు నాణ్యత, సామర్థ్యం, ఉత్పత్తి అయ్యేలా చూడాలని సూచించారు. అలాగే ఉపరితల గనుల్లో ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలతో బొగ్గు ఉత్పత్తి తీయాలని సూచించారు. ఆర్‌సీహెచ్‌పీ నుండి రైలు మార్గం ద్వారా జరుగుతున్న బొగ్గు రవాణాను పరిశీలించారు. బొగ్గు గ్రేడ్‌లను పరిశీలించి నాణ్యమైన బొగ్గును సరఫరా చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జీఎంతో పాటు ఎస్‌ఓ టు జీఎం గోవిందరావు, ఏరియా ఇంజనీర్ విత్తనాల రామకృష్ణ, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, వీకే సీఎం మేనేజర్ మురళి, సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్, ఇతర విభాగాల అధిపతులు, అధికారులు పాల్గొన్నారు.