BREAKING
దేశాన్ని వణికించిన యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన సంచలన చిత్రం.. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ మెగా రైతు మేళాకు భారీగా తరలిన రైతులు ప్రజావాణికి ఒకే ఒక్క దరఖాస్తు ఎంపీడీవో జయరాం విజయ్ నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి ఆంత్రోపిక్‌కు షాక్...'క్లాడ్' సబ్‌స్క్రిప్షన్ మార్కెటింగ్ వివాదంపై కోర్టులో కొనసాగనున్న వ్యాజ్యం ఫ్రాన్స్‌లో స్మార్ట్ రిఫ్రిజిరేటర్లపై సైబర్ దాడి కలకలం హరిత భవిష్యత్తుకు గ్రిడ్లు, ఫైనాన్స్, ఉద్యోగ కల్పనే కీలకం అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగ భయాలు డ్రోన్ ముప్పును తిప్పికొట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం అమెరికాలో హోండా ఓహియోలో రూ.25 వేల కోట్లతో కొత్త ఆటో ప్లాంట్ కుంభ రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani పోలాండ్‌లోని క్రాకోవ్ నగరంలో కాల్పుల ఘటన...దిగ్భ్రాంతిలో దేశ ప్రజలు ఈయూ బడ్జెట్‌లో పర్యవేక్షణ తగ్గిస్తే సహించేది లేదు యంగ్ హీరో రోషన్ మేకతో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ క్రేజీ ప్రాజెక్ట్.. జటాయుగా రానున్న విజువల్ వండర్ యూరోపియన్ యూనియన్ నుంచి యూనిక్రెడిట్‌కు ఊరట

రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తాం. – రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Select Suryaa Now
రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తాం. – రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 సూర్య కరీంనగర్ ప్రతినిధి :ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల అనంతరం జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులందరం సమష్టిగా పనిచేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కలిసి 46వ డివిజన్‌లో రూ.1.50 కోట్ల UIDF నిధులతో బాక్స్ టైప్ డ్రెయిన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 23వ డివిజన్ సీతారాంపూర్, రెడ్డి ఫంక్షన్ హాల్ రోడ్డు ప్రాంతాల్లో రూ.65 లక్షల UIDF, రూ.34 లక్షల MGF నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు, మౌలిక సదుపాయాలు, పర్యాటక రంగాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. భీమదేవరపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు, జమ్మికుంట, హుస్నాబాద్‌లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాల నిర్మాణం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులు పూర్తి చేసి ప్రజలకు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, కొత్తకొండ ఆలయాలతో పాటు ఎలగందుల ఖిల్లా పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకొచ్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఉత్తర తెలంగాణలో అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్, గుమ్మడి రాజ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారూ.