చెరువు నాలా కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి
యాదగిరిగుట్ట మేజర్ న్యూస్.…యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని న్యూ గుండ్లపల్లిలో ఉన్న తోపుగాని చెరువు నాలాను ఆక్రమిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కి ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఇరిగేషన్ అధికారులను వెంటనే విచారణ చేయాలని ఆదేశించారు.