BREAKING
ప్రజావాణికి ఒకే ఒక్క దరఖాస్తు ఎంపీడీవో జయరాం విజయ్ నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి ఆంత్రోపిక్‌కు షాక్...'క్లాడ్' సబ్‌స్క్రిప్షన్ మార్కెటింగ్ వివాదంపై కోర్టులో కొనసాగనున్న వ్యాజ్యం ఫ్రాన్స్‌లో స్మార్ట్ రిఫ్రిజిరేటర్లపై సైబర్ దాడి కలకలం హరిత భవిష్యత్తుకు గ్రిడ్లు, ఫైనాన్స్, ఉద్యోగ కల్పనే కీలకం అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగ భయాలు డ్రోన్ ముప్పును తిప్పికొట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం అమెరికాలో హోండా ఓహియోలో రూ.25 వేల కోట్లతో కొత్త ఆటో ప్లాంట్ కుంభ రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani పోలాండ్‌లోని క్రాకోవ్ నగరంలో కాల్పుల ఘటన...దిగ్భ్రాంతిలో దేశ ప్రజలు ఈయూ బడ్జెట్‌లో పర్యవేక్షణ తగ్గిస్తే సహించేది లేదు యంగ్ హీరో రోషన్ మేకతో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ క్రేజీ ప్రాజెక్ట్.. జటాయుగా రానున్న విజువల్ వండర్ యూరోపియన్ యూనియన్ నుంచి యూనిక్రెడిట్‌కు ఊరట మీన రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani దేశవ్యాప్తంగా ఘనంగా ‘దీపావళి స్నేహ్ మిలన్’

ఏళ్ల నాటి సొంతింటి కళ సాకారం..!

Select Suryaa Now
ఏళ్ల నాటి సొంతింటి కళ  సాకారం..!

 

షాబాద్, మేజర్ న్యూస్ (నవంబర్ 09)దీపావళి పండుగను పురస్కరించుకొని చందనవెల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్ల వద్ద ప్రత్యేక సంబరాలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చేవెళ్ల నవనీత స్వామి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంజుల రాజ మల్లయ్య, శోభ, భిక్షపతి, ప్రేమలతయాదయ్య, శాంతమ్మ మల్లేష్ కుటుంబాల ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి పండుగ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ... ఎన్నో ఏళ్ల తమ సొంతింటి కళ  ఇందిరమ్మ ఇళ్ల పథకంతో నెరవేరిందని, సొంతింట్లో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ స్వయంగా తమ ఇళ్లకు వచ్చి పండుగ వేడుకల్లో పాల్గొనడం మరింత సంతోషాన్నిచ్చిందని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాదయ్య, ఉపసర్పంచ్ శ్రీశైలం, వార్డు సభ్యులు శ్రీహరి, మీరంపల్లి వెంకటేష్, గుర్రం రమేష్, గ్రామ అధ్యక్షుడు గాడీల కిష్టయ్య, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.