అర్ధనారీశ్వర స్వామి ఆలయంలో ఆకాశదీపం.
శ్రీకాళహస్తిలో కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కార్తీక మాసాన్ని శ్రీకాళహస్తీశ్వర స్వామి అనుబంధ దేవాలయం శ్రీ అర్ధనారీశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం సాయంత్రం ఆకాశదీపం వెలిగించే కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు.
కార్తీక మాసంలో ప్రతిరోజూ సాయంత్రం ఆకాశదీపాన్ని వెలిగించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ పవిత్ర సంప్రదాయంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఆకాశదీపాన్ని ప్రారంభించారు.
అర్ధనారీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తిపూర్వకంగా స్వామిని పూజించారు. అనంతరం ఆలయం నుంచి జ్వాలాదీపాన్ని తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలో ఆకాశదీపాన్ని వెలిగించారు. దీపపు వెలుగులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో విశిష్టత ఉండటంతో భక్తులు ఆకాశదీపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన్ సునీత, గోవిందు సభ్యులు, శ్రీకాళహస్తి దేవస్థానం సూపరింటెండెంట్ రవి, అనుబంధ ఆలయాల ఇంచార్జ్ లక్ష్మయ్య, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో అర్ధనారీశ్వర స్వామి ఆలయంలో కార్తీక దపం
కార్యక్రమం
కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం ఆకాశదీపం వెలిగించే కార్యక్రమం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.