సింహ రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Leo Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
సింహరాశి… వారం ప్రారంభంలో ఆత్మస్థైర్యంతో, అధిక శ్రమతో పనులు పూర్తి చేసే ప్రయత్నాలు, కుటుంబ ఆర్థిక వ్యవహారాలలో, వృత్తిలో కొలీగ్స్తో అవగాహన అవసరం. వృత్తిపరంగా శ్రమ, ఘర్షణలు అధిగమిస్తూ ప్రణాళికా పరంగా వెళ్లాలి. విద్యార్థులు స్క్రీన్ టైమ్ నియంత్రణ అవసరం. ముఖ్యంగా నిద్రలేమి సరి చూసుకుంటూ ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి. వారం మధ్యలో స్థిరాస్తి, విద్యా, భూ అంశాలు, తల్లి ఆరోగ్య వ్యవహారాలలో దృష్టి సారిస్తారు. దీర్ఘకాలికి పెట్టుబడులలో ఆలోచనలు. గృహవాతావరణంలో ప్రశాంతత పెంపొందించు కోవాలి. వారాంతం సంతానవృద్ధి, ఆత్మీయుల కొరకు ఖర్చులు, నూతన పెట్టుబడుల చర్చలు. ప్రశాంత నిర్ణయాలు ముఖ్యం. హనుమాన్ చాలీసా మేలు చేస్తుంది.