మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసిన ఆళ్లగడ్డ జడ్పిటిసి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్:నంద్యాల జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం ఆళ్లగడ్డ జెడ్పిటిసి సభ్యుడు పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సోమవారం బనగానపల్లి లో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి జడ్పీ చైర్మన్గా తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు .అనంతరం ఆయన మేజర్ న్యూస్ తో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 28 మంది జడ్పీటీసీలు ఉన్నారని వారిలో తాను కూడా ఒకడినని చైర్మన్ పదవిని ఆశిస్తున్నానని స్పష్టం చేశారు మంత్రితో పోరెడ్డి భేటీ కావడంతో జిల్లా రాజకీయాలు ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా