డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ ఆధ్వర్యంలో ఘనంగా గోపినాథ్ జన్మదిన వేడుకలు
మేజర్ న్యూస్.,శాలిగౌరారం
తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమకారుడు , తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల గోపీనాథ్ జన్మదినం సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.. ఈ సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,స్నేహితులు, ఆత్మీయులు పెద్దలు పలువురు వేముల గోపీనాథ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.. ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటూ ప్రజా సేవలో ముందుకు సాగాలని పలువురు కోరారు.అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పలువురు పెద్దలు సూచించారు.
జిల్లా అధ్యక్షుల్ని కలిసిన వారిలో శాలిగౌరారం మండల సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు తోటకూరి పరుశురాం, మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇంధనూరి శ్రీను,ఉప సర్పంచ్ అంబాల హరీష్,నాగార్జున,బన్నీ,వినీత్,సందీప్, శరత్,తదితరులు ఉన్నారు..
ఫోటో రైటప్ :
వేముల గోపినాథ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాస్ నేత..