BREAKING
ప్రజావాణికి ఒకే ఒక్క దరఖాస్తు ఎంపీడీవో జయరాం విజయ్ నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి ఆంత్రోపిక్‌కు షాక్...'క్లాడ్' సబ్‌స్క్రిప్షన్ మార్కెటింగ్ వివాదంపై కోర్టులో కొనసాగనున్న వ్యాజ్యం ఫ్రాన్స్‌లో స్మార్ట్ రిఫ్రిజిరేటర్లపై సైబర్ దాడి కలకలం హరిత భవిష్యత్తుకు గ్రిడ్లు, ఫైనాన్స్, ఉద్యోగ కల్పనే కీలకం అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగ భయాలు డ్రోన్ ముప్పును తిప్పికొట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం అమెరికాలో హోండా ఓహియోలో రూ.25 వేల కోట్లతో కొత్త ఆటో ప్లాంట్ కుంభ రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani పోలాండ్‌లోని క్రాకోవ్ నగరంలో కాల్పుల ఘటన...దిగ్భ్రాంతిలో దేశ ప్రజలు ఈయూ బడ్జెట్‌లో పర్యవేక్షణ తగ్గిస్తే సహించేది లేదు యంగ్ హీరో రోషన్ మేకతో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ క్రేజీ ప్రాజెక్ట్.. జటాయుగా రానున్న విజువల్ వండర్ యూరోపియన్ యూనియన్ నుంచి యూనిక్రెడిట్‌కు ఊరట మీన రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani దేశవ్యాప్తంగా ఘనంగా ‘దీపావళి స్నేహ్ మిలన్’

స్వంతింటి కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ... పేదల కండ్లల్లో దీపావళి వెలుగులు

Select Suryaa Now
స్వంతింటి కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ... పేదల కండ్లల్లో దీపావళి వెలుగులు
సూర్య కరీంనగర్:ఇల్లులేని ప్రతిఒక్క కుటుంబానికి స్వంత ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ గృహాలను మంజూరు చేసిందని,ఇళ్లు పూర్తయిన తర్వాత వచ్చిన మొదటి దీపావళి పండుగను లబ్ధిదారులు ఎంతో సంతోషంగా జరుపుకున్నారని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ఖాన్ పేట్ మరియు దుబ్బపల్లి గ్రామాలలో నరేందర్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి దీపాలు వెలిగించి టపాకాయలు పేల్చి సంబరాలలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఇళ్లు లేని ప్రతి కుటుంబానికి స్వంత ఇల్లు కట్టిస్తామని చెప్పి మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంజూరు చేయడం జరిగిందని నిర్మించుకున్న లబ్ధిదారులకు ఇది మొట్టమొదటి దీపావళి పండుగ అని లబ్ధిదారులు ఎంతో సంతోషంగా స్వంత ఇంటిలో దీపావళి పండుగ జరుపుకోవడం అందులో మేము భాగస్వాములం కావడం ఆనందంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో బహదూర్ఖాన్ పేట్ మరియు దుబ్బపల్లి సర్పంచులు గుర్రం సంధ్య తిరుపతిరెడ్డి,మోతె ప్రశాంత్ రెడ్డి,ఉప సర్పంచులు తప్పట్ల రమేష్, అలువాల శ్రీకాంత్,సెక్రటరీలు మహేందర్,సుజాత,లబ్ధిదారులు బుర్ర మానస అనిల్,మోతె వెన్నెల, సిరిగిరి స్వరూప,జూబ్లీనగర్,చామన్ పల్లి సర్పంచులు కమల్ గౌడ్, బోగొండ ఐలయ్యతో పాటు వార్డు మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.