జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అడువాల జ్యోతి లక్ష్మణ్
సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా జగిత్యాల పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. జిల్లాలో మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు మహిళలను రాజకీయంగా చైతన్యవంతులను చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు.తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్యలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.