BREAKING
ప్రజావాణికి ఒకే ఒక్క దరఖాస్తు ఎంపీడీవో జయరాం విజయ్ నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి ఆంత్రోపిక్‌కు షాక్...'క్లాడ్' సబ్‌స్క్రిప్షన్ మార్కెటింగ్ వివాదంపై కోర్టులో కొనసాగనున్న వ్యాజ్యం ఫ్రాన్స్‌లో స్మార్ట్ రిఫ్రిజిరేటర్లపై సైబర్ దాడి కలకలం హరిత భవిష్యత్తుకు గ్రిడ్లు, ఫైనాన్స్, ఉద్యోగ కల్పనే కీలకం అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగ భయాలు డ్రోన్ ముప్పును తిప్పికొట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం అమెరికాలో హోండా ఓహియోలో రూ.25 వేల కోట్లతో కొత్త ఆటో ప్లాంట్ కుంభ రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani పోలాండ్‌లోని క్రాకోవ్ నగరంలో కాల్పుల ఘటన...దిగ్భ్రాంతిలో దేశ ప్రజలు ఈయూ బడ్జెట్‌లో పర్యవేక్షణ తగ్గిస్తే సహించేది లేదు యంగ్ హీరో రోషన్ మేకతో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ క్రేజీ ప్రాజెక్ట్.. జటాయుగా రానున్న విజువల్ వండర్ యూరోపియన్ యూనియన్ నుంచి యూనిక్రెడిట్‌కు ఊరట మీన రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani దేశవ్యాప్తంగా ఘనంగా ‘దీపావళి స్నేహ్ మిలన్’

బొల్లారం డివిజన్ లో కోర్ కమిటీ సమావేశం

Select Suryaa Now
బొల్లారం డివిజన్ లో కోర్ కమిటీ సమావేశం

 జిన్నారం:బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతి నెలా నిర్వహించే మండల స్థాయి సమావేశాల్లో భాగంగా సోమవారం బొల్లారం డివిజన్ కోర్ కమిటీ సమావేశం విజయవంతంగా జరిగింది. సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు సి.గోదావరి అంజిరెడ్డి పిలుపు మేరకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొల్లారం పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రోడ్ల దుస్థితి, వీధి దీపాల కొరత, వృద్ధులు, దివ్యాంగుల పెన్షన్ సమస్యలు, ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు తదితర అంశాలను సమావేశంలో ప్రస్తావించారు. ఐటీసీ కంపెనీ నుంచి బొల్లారం గాంధీ విగ్రహం వరకు రహదారి పూర్తిగా గుంతలమయంగా మారిందని, దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు పేర్కొన్నారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. అదేవిధంగా ఐటీసీ నుంచి గాంధీ విగ్రహం వరకు, హనుమాన్ టెంపుల్ నుంచి మైలాన్ కంపెనీ వరకు వీధి దీపాలు లేక రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే కొత్త వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. వృద్ధులు, దివ్యాంగులు పెన్షన్లు పొందే కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్మికులు, పేద ప్రజలు అధికంగా నివసించే బొల్లారంలో ఈఎస్ఐ ఆసుపత్రి లేకపోవడం విచారకరమని, కార్మికుల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని బొల్లారంలో వెంటనే ఈఎస్ఐ ఆసుపత్రిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రజలకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు, కోర్ కమిటీ సభ్యులు, ముఖ్య కార్యకర్తలు, పార్టీ నాయకులు యశ్వంత్, టి. రవీందర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, శ్రీకాంత్ చారి, అఖిల్, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.