ఖాళీ పోస్టులు భర్తీ చేయండి
ఖాళీ పోస్టులు భర్తీ చేయండి
- అంతర్గత ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలి
- సింగరేణి జీఎంను కోరిన వైస్ ప్రెసిడెంట్ రజాక్కొత్తగూడెం సింగరేణి, సూర్య(మేజర్ న్యూస్) - సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్‌లు మరియు వివిధ డిపార్ట్‌మెంట్లలో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సూపరింటెండెంట్ మరియు పర్సనల్ ఆఫీస్ అసిస్టెంట్ విభాగ పోస్టులను అంతర్గత ఉద్యోగులతో భర్తీ చేసి, అర్హులకు పదోన్నతులు కల్పించాలని ఐఎన్ టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ కోరారు. దీనిలో భాగం సోమవారం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సిహెచ్. వెంకటరమణను జీఎం కార్యాలయంలో కలిసి మెమోరాండం అందజేశారు.ఈ సందర్భంగా ఎండీ రజాక్ మాట్లాడుతూ కొత్తగూడెం ఏరియాలోని మైన్స్, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు మరియు డిపార్ట్‌మెంట్స్ ఇతర విభాగాలలో జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సూపరింటెండెంట్లు (ఓఎస్) మరియు పర్సనల్ ఆఫీస్ అసిస్టెంట్ (పీఓఏ ) వంటి కీలక పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ ఖాళీలలో చాలా వరకు జూనియర్ అసిస్టెంట్లే ఇన్‌ఛార్జ్ / యాక్టింగ్ బాధ్యతలు నిర్వహిస్తూ తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి, ప్రస్తుతం సేవలందిస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు సరైన సమయానికి ప్రమోషన్లు రాకపోవడంతో పదోన్నతులు వారికి "అందని ద్రాక్ష"గా మారాయని పేర్కొన్నారు. ఈ ఖాళీలను ఏరియాలో పనిచేస్తున్న అర్హులైన అంతర్గత ఉద్యోగుల ద్వారా భర్తీ చేయడం వల్ల సంస్థకు అనుభవజ్ఞులైన సిబ్బంది సేవలు అందడంతో పాటు, ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినట్లవుతుందని జీఎం దృష్టికి తీసుకువెళ్లారు.తక్షణమే ఏరియాలోని ఖాళీల వివరాలను సేకరించి, సంబంధిత అధికారులకు నివేదించి, అంతర్గత నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేసేలా చొరవ చూపాలని జీఎం సిహెచ్. వెంకటరమణను కోరారు. ఇందుకు జీఎం సానుకూలంగా స్పందించి, ఖాళీల వివరాలను పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు రజాక్ తెలిపారు.