ప్రజావాణికి మూడు దరఖాస్తులు..
• అక్రమ నిర్మాణాలు
• అక్రమ వెంచర్లపై చర్యలు
• ధరల దోపిడీపై ఫిర్యాదులు
సూర్య, లక్షెట్టిపేట :
మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరై ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. మొత్తం మూడు దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో అనిల్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా మండల పరిధిలో అక్రమ భవన నిర్మాణాలను అరికట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పాటు అధిక ధరలకు విక్రయిస్తూ జరుగుతున్న దోపిడీని అరికట్టి వినియోగదారులకు ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు సమర్పించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో అనిల్ కుమార్ సూచించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై అధికారులు స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు.