కోయలపాడు గ్రామంలో భూ రీసర్వే గ్రామసభ
మాడ్గులపల్లి,మేజర్ న్యూస్:
మాడ్గులపల్లి మండలం గుర్రప్పగూడెం గ్రామ పంచాయతీ కోయలపాడు గ్రామంలో సోమవారం భూముల రీసర్వే గ్రామసభ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా తహసీల్దార్, సామల సరోజ పావని,కొలతల శాఖ ఉప తనిఖీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, మాట్లాడుతూ గ్రామం లో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ రీ సర్వే కు గ్రామ ప్రజలు సహకరించి తమ భూముల సమగ్ర వివరాలను హద్దులను సర్వే సిబ్బందికి తెలియజేసి భూ రీ సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్,గ్రామ పాలన అధికారి, కొలతల అధికారి స్థానిక సర్పంచి,పందిరి మారయ్య, గ్రామ ప్రజలు పాల్గొని గ్రామ సరిహద్దుల గుర్తింపు రాళ్లు పాతే పనులను ప్రారంభించారు.