విద్యార్థులు చదువుకుంటే నీ భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు
కోయిల్ కొండ సూర్య న్యూస్: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు బాగా చదువుకుంటేనే భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎస్ఐ నాగరాజు తెలిపారు. సోమవారం మండలంలో ఉన్న చంద్రస్ పల్లి గ్రామపంచాయతీ లోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజా భద్రత పోలీస్ బాధ్యత కార్యక్రమం గురించి షీ టీం వారి సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, సైబర్ నేరగాల గురించి అత్యంత జాగ్రత్త ఉండాలని సూచించారు. అదేవిధంగా సమాజంలో జరుగుతున్న పలు అంశాల గురించి పోలీసులు కళాబృందం చే వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ అనురాధ, పోలీసులు రాములు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.