మండల "సూర్యకళ"ను అభినందించిన "బొత్స"...
గజపతినగరం, సూర్య : గజపతినగరం వైఎస్ఆర్సిపి జడ్పిటిసి అభ్యర్థిగా ఘన విజయం సాధించిన మండల సూర్యకళను మాజీమంత్రి, వైఎస్ఆర్సిపి శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి అభినందించారు. సోమవారం మండల సూర్య కళ, భర్త మండల సురేష్ మర్యాదపూర్వకంగా బొత్స సత్యనారాయణ, ఝాన్సీ లక్ష్మీలను విజయనగరంలోని వారి స్వగృహములో మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా బొత్స దంపతులిద్దరూ సూర్య కళను అభినందించి, కాసేపు మాట్లాడారు. ఆమె వెంట మండల పార్టీ అధ్యక్షులు పల్లి సంజీవరావు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ కోఆర్డినేటర్ బూడి వెంకటరావు, కరణం ఆదినారాయణ, కే.పైడ పునాయుడు, రేగ సురేష్, గొర్లె శ్రీకాంత్, లోగిస శ్రీను, ఆధార్ గోపి, పలురు నాయకులు ఉన్నారు.