ధరలు నియంత్రించాలని నిరసన - శ్రీ విముక్తి సంఘటన కమిటీ
వెంకటగిరి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పల్లెవీధిలోని శ్రీకాళహస్తి శేషయ్య స్మారక భవనం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్త్రీవిముక్తి సంఘటన రాష్ట్ర సహాయ కార్యదర్శి పి. కొండమ్మ మాట్లాడుతూ
నిత్యావసర వస్తువులైన బియ్యం, పప్పులు, ఉల్లిపాయలు, పంచదార, నూనె కన్నింటి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నoటాయి. 25 కిలోల బియ్యం బస్తా రెండేళ్ల క్రితం 14 వందల రూపాయలు ఉండగా నేడు 2300 దాటగా, ధనియాలు కిలో 280 అమ్ముతున్నదన్నారు.పేద, మధ్యతరగతి ప్రజలు కనీస అవసరాలైన సరుకులను కొనుక్కోలేక, అర్ధాకలితో కాలం వెళ్ళబుచ్చాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ధరలను తగ్గించి, ప్రజల జీవితాలను కాపాడాల్సిన పాలకులు మరింతభారాలను మోపుతున్నారని విమర్శించారు.
రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి జి. సునీత మాట్లాడుతూ ప్రతి కుటుంబం లో పెరుగుతున్న ధరల కారణంగా అర్ధాకలి తో అలమటించేది మహిళలే నన్నారు. రైతు చేతిలో పంట ఉన్నప్పుడు రైతు పంటకి ధర దిగ్గొసి బడా వ్యాపారులు నిలువచేసి తమ ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నా పాలకులకు పట్టడం లేదన్నారు. అంతేకాకుండా పాలకులు విదేశీ బహుళజాతి కంపెనీ ల సరకులను దిగుమతి చేసుకుంటూ, ఈరోజు దేశంలో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న ఫలితంగా ఆ కంపెనీలు నిర్ణయించిన ధరలకు కొనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. పెరుగుతున్న ధరలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మహిళలంతా ఆందోళన కు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముందుగా ఏరియా కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
కార్యక్రమంలో స్త్రీవిముక్తి సంఘటన రాష్ట్ర కమిటీ సభ్యురాలు కె. అజిత, జిల్లా అధ్యక్షురాలు రత్నమ్మ, స్థానిక నాయకులు జాన్సీ, దేవి తదితరులు పాల్గొన్నారు.
వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి 9644411197"