BREAKING
అమెరికాలో సెప్టెంబర్ నెల టోకు నిల్వలు పైకి సవరణ అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ స్వాధీనం.. ఏళ్ల నాటి సొంతింటి కళ సాకారం..! ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు అమెరికాలో మాంసపరిశ్రమను బలోపేతం చేసే దిశగా టైసన్ ఫుడ్స్ కీలక నిర్ణయం కెనడా సావరిన్ వెల్త్ ఫండ్‌ కొత్త చీఫ్‌గా కారెన్ కర్నియోల్-టాంబూర్ బొల్లారం డివిజన్ లో కోర్ కమిటీ సమావేశం కీలక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రక్షణకు చెక్ రిపబ్లిక్ కీలక అడుగు ఖాళీ పోస్టులు భర్తీ చేయండి ఎఫ్‌డీఏ ఓజెంపిక్, జెప్‌బౌండ్ మందులపై కొత్త కంటి ప్రమాద హెచ్చరికలు కోయలపాడు గ్రామంలో భూ రీసర్వే గ్రామసభ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అడువాల జ్యోతి లక్ష్మణ్ జనసేన నాయకులు నవీన్ నిశ్చల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ వెంకట సాయి ప్రజావాణికి మూడు దరఖాస్తులు.. అర్ధనారీశ్వర స్వామి దేవస్థానంలో ఆకాశదీపం

తొలిసారి జెడ్పీటీసీగా గెలిచి తెర్లాం టీడీపీ కార్యాలయంలో అడుగుపెట్టిన సిరి సహస్ర

Select Suryaa Now
తొలిసారి జెడ్పీటీసీగా గెలిచి తెర్లాం టీడీపీ కార్యాలయంలో అడుగుపెట్టిన సిరి సహస్ర

తెర్లాం/ విజయనగరం మేజర్ న్యూస్ 

రాజకీయ వారసత్వాన్ని కేవలం పదవిగా కాకుండా, ప్రజలకు సేవ చేసే ఒక పవిత్ర బాధ్యతగా మలచుకోవాలనే సంకల్పంతో తెర్లాం రాజకీయాల్లో నూతన అధ్యాయం ప్రారంభమైంది. బొబ్బిలి నియోజకవర్గం, తెర్లాం మండల జడ్పీటీసీగా ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ పరిశీలకులు, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ కుమార్తె సిరి సహస్ర , ఆమె భర్త ప్రదీప్ నాయుడు దంపతులు తొలిసారిగా తెర్లాం టీడీపీ కార్యాలయానికి విచ్చేశారు.

ఈ సందర్భంగా తెర్లాం మండలంలోని ఎంపీటీసీలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శ్రేణులు వారికి శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి అపూర్వ స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తల కోలాహలంతో కార్యాలయ ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది.

పరస్పర గౌరవం – ఆత్మీయ సత్కారాలు

తమకు స్వాగతం పలికి అభినందించడానికి విచ్చేసిన తెర్లాం మండలంలోని ఎంపీటీసీ సభ్యులందరినీ కూడా సిరి సహస్ర , ప్రదీప్ నాయుడు దంపతులు శాలువాలతో ఘనంగా సన్మానించి తమ ఐక్యతను చాటారు. ఈ ఆత్మీయ కలయిక పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. తెర్లాం మండల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రతి గడపకూ ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి ఫలాలను చేరవేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను: జడ్పీటీసీ సిరి సహస్ర 

ఈ సందర్భంగా జడ్పీటీసీ సిరి సహస్ర  మాట్లాడుతూ — "ప్రజలు నాపై ఉంచిన అపారమైన నమ్మకాన్ని, అభిమానాన్ని ఎప్పటికీ వమ్ము చేయను. తెర్లాం మండల సర్వతోముఖాభివృద్ధే నా ప్రథమ కర్తవ్యం. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, అందరి సమన్వయంతో మండలాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాను. నన్ను ఆశీర్వదించి, అభినందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.

భారీగా పాల్గొన్న పార్టీ నాయకులు

ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఏఎంసీ చైర్మన్ వెంకట నాయుడు, తెర్లాం మండల పార్టీ అధ్యక్షులు నర్సుపల్లి వెంకటేష్, మాజీ వైస్ ఎంపీపీ వెలగవలస చేపేన సత్యనారాయణ, మండల ఎంపీటీసీలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీనివాస్ బ్యూరో విజయనగరం