సూర్య గన్నేరువరం :గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి గ్రామానికి చెందిన బిక్కవాగు నుంచి ప్రభుత్వ అనుమతులు లేకుండా ట్రాక్టర్ ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సోమవారం తెల్లవారుజామున గన్నేరువరం గ్రామ శివారులో ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ బుర్ర ప్రణయ్, యజమాని ముదిగంటి అంజయ్య (గన్నేరువరం)పై కేసు నమోదు చేసినట్లు గన్నేరువరం ఎస్‌ఐ తెలిపారు.