BREAKING
ప్రజారోగ్యమే లక్ష్యంగా బస్తీ దవాఖానాలో అవగాహన కార్యక్రమం జడ్పిటిసి హర్షిత్ రెడ్డి కి అభినందనలు తెలిపిన జనార్దన్ యాదవ్ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.. భద్రతా విధానాలపై ఐరోపా యూనియన్ పునరాలోచన చేయాలని తేల్చిచెప్పిన ఈయూ నేత టెరెసా రిబెరా అహ్మదాబాద్‌లో రూ. 1,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీపావళి వేడుకల్లో ప్రియుడితో సందడి చేసిన కృతి సనన్.. బాలీవుడ్ ప్రముఖుల హాజరు అమెరికా న్యాయశాఖ సివిల్ డివిజన్ అధిపతి రాజీనామా అమెరికా సుప్రీంకోర్టులో దివంగత బేస్‌బాల్ దిగ్గజం రాబర్టో క్లెమెంట్ కుటుంబానికి చుక్కెదురు డైమండ్ దిగ్గజం డీ బీర్స్‌లో వాటాను 30 శాతానికి పెంచుకోనున్న బోత్వానా మైత్రీ మూవీ మేకర్స్ ‘DNK’ ట్రైలర్ విడుదల: ఫుల్ ఆన్‌లైన్ బెట్టింగ్ మానియాతో నవ్వులు పూయిస్తున్న ఎంటర్‌టైనర్ అమెజాన్ అడవుల పరిరక్షణకు భారీ ఆర్థిక సాయం మెడికల్ షాప్ లో తనిఖీ చేసిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కూటమిపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం గ్రామ పంచాయతీల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం కావాలి : ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చిలీ కోడెల్కో సంస్థలో ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి పొలిమేర 3 నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా 'విరావి' ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల

బాలికల సమీకృత వసతి గృహాన్ని జడ్జి ఆకస్మిక తనిఖీ

Select Suryaa Now
బాలికల సమీకృత వసతి గృహాన్ని జడ్జి ఆకస్మిక తనిఖీ

కనిగిరి ,మేజర్ న్యూస్ :పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత బాలికల వసతి గృహాన్ని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జడ్జి బి.రూపశ్రీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వసతి గృహంలోని వంటశాల,వసతి గదులను పరిశీలించారు.వసతి గృహంలో విద్యార్థినులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు,పౌష్టికాహార పంపిణీ తదితర అంశాలపై విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం విద్యార్థినులకు చట్టాలపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దాని వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు సైబర్ మోసాలు, ఆన్‌లైన్ వేధింపులు వంటి ముప్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు .విద్యార్థినులకు ఏవైనా సమస్యలు ఎదురైనా, అత్యవసర న్యాయ సహాయం అవసరమైనా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.