BREAKING
జడ్పిటిసి హర్షిత్ రెడ్డి కి అభినందనలు తెలిపిన జనార్దన్ యాదవ్ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.. భద్రతా విధానాలపై ఐరోపా యూనియన్ పునరాలోచన చేయాలని తేల్చిచెప్పిన ఈయూ నేత టెరెసా రిబెరా అహ్మదాబాద్‌లో రూ. 1,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీపావళి వేడుకల్లో ప్రియుడితో సందడి చేసిన కృతి సనన్.. బాలీవుడ్ ప్రముఖుల హాజరు అమెరికా న్యాయశాఖ సివిల్ డివిజన్ అధిపతి రాజీనామా అమెరికా సుప్రీంకోర్టులో దివంగత బేస్‌బాల్ దిగ్గజం రాబర్టో క్లెమెంట్ కుటుంబానికి చుక్కెదురు డైమండ్ దిగ్గజం డీ బీర్స్‌లో వాటాను 30 శాతానికి పెంచుకోనున్న బోత్వానా మైత్రీ మూవీ మేకర్స్ ‘DNK’ ట్రైలర్ విడుదల: ఫుల్ ఆన్‌లైన్ బెట్టింగ్ మానియాతో నవ్వులు పూయిస్తున్న ఎంటర్‌టైనర్ అమెజాన్ అడవుల పరిరక్షణకు భారీ ఆర్థిక సాయం మెడికల్ షాప్ లో తనిఖీ చేసిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కూటమిపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం గ్రామ పంచాయతీల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం కావాలి : ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చిలీ కోడెల్కో సంస్థలో ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి పొలిమేర 3 నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా 'విరావి' ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మార్కెట్ పతనం అతిశయోక్తి, నియంత్రణ భయాలు అనవసరం

కొత్త కొత్తూరు లో న్యాయసేవా దినోత్సవం

Select Suryaa Now
కొత్త కొత్తూరు లో న్యాయసేవా దినోత్సవం

కొత్తూరు, సూర్య : పేద బలహీన బడుగు వర్గాల ప్రజలకు అందిస్తున్న ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల సేవా కమిటీ చైర్ పర్సన్ కొత్తూరు జూనియర్ సివిల్  జడ్జి  కందికట్ల రాణి అన్నారు. కొత్తూరు కోర్టు ఎదురుగా ఉన్న కొత్త కొత్తూరు లో న్యాయ సేవా దినోత్సవం సందర్బంగా సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు జడ్జి కందికట్ల రాణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా జడ్జి మాట్లాడుతూ అందరికీ సమాన న్యాయం అందుబాటులో ఉండేలా ఉండేందుకు  ఏర్పాటు చేస్తున్న న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సులు ప్రజలు అవగాహన చేసుకోవాలని జడ్జి అన్నారు.సమాజం లో బలహీన, వెనుకబడిన మరియు పేద వర్గాల వారికీ ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందన్నారు. బ్యాంకు రికవరీ కేసులు, వరకట్న వేధింపులు, సివిల్ కేసులు భూ తగాదా, మనోవర్తి, విడాకులుకేసులు, సెల్ ఫోన్లు వలన కలిగే నష్టాలు తెలియజేశారు.  ఉచితంగా న్యాయ సలహాలు సూచనలు అందించడం తో పాటు ఆర్ధిక స్తోమత లేనివారు, నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ప్రభుత్వ ఖర్చులతో న్యాయవాదిని సమకూర్చి బాధితుల పక్షాన నిలబడి వారికి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రసిడెంట్ సి హెచ్ రవికిరణ్, వలు రౌతు సుధాకరరావు, ఏ జి పి  యం అప్పారావు, వి ఫాల్గుణ రావు రాడ రాజు, యస్ హరిబాబు, జి ఫల్గుణరావు,  ఉమామహేశ్వరావు,కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.