వత్సవాయి జడ్పీటీసీగా వడ్లమూడి రాంబాబుకు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేత
వత్సవాయి: ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండల జడ్పీటీసీ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వడ్లమూడి రాంబాబుకు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, రిటర్నింగ్ అధికారి పి. సుశీల అందజేశారు. నవంబర్ 9న విజయవాడలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె అధికారిక ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యుడు వడ్లమూడి రాంబాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన వత్సవాయి మండల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. మండలంలోని గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కార్యాలయ అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బంది, నూతన సభ్యుల వెంట వచ్చిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.