ఆప్తాల్మిక్ అసిస్టెంట్లకు తాత్కాలిక ఉద్యోగావకాశాలు
- కంటి పరీక్షల కోసం ఐదుగురి నియామకం
- రోజుకు రూ.1,000 పారితోషకం.. దరఖాస్తులకు ఆహ్వానం
- 50 రోజుల పాటు కంటి పరీక్షలు.. అసిస్టెంట్ల నియామకం
- నిరుద్యోగ ఆప్తాల్మిక్ అసిస్టెంట్లకు అవకాశం
రంగారెడ్డి, మేజర్ న్యూస్ (నవంబర్ 9): రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో తాత్కాలిక ప్రాతిపదికన ఐదుగురు ఆప్తాల్మిక్ అసిస్టెంట్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు 50 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ విధుల్లో పాల్గొనే ఆప్తాల్మిక్ అసిస్టెంట్లకు రోజుకు రూ.1,000 చొప్పున పారితోషకం చెల్లించనున్నట్లు వెల్లడించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సుకు సంబంధించిన విద్యార్హత ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ ప్రతులను సమర్పించాలని సూచించారు.
ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం, పిల్లర్ నంబర్ 294, శివరాంపల్లి చిరునామాలో దరఖాస్తులు అందజేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సూచించారు.