BREAKING
విజేత, కటకం కుమారస్వామిని అభినందించిన ఎమ్మెల్యే ఆనందబాబు టాలీవుడ్‌లో కొత్త క్రైండ్‌గా మారిన మలయాళ బ్యూటీ అన.. నేటి కుర్రకారును ఆకట్టుకుంటున్న వైనం ప్రజారోగ్యమే లక్ష్యంగా బస్తీ దవాఖానాలో అవగాహన కార్యక్రమం జడ్పిటిసి హర్షిత్ రెడ్డి కి అభినందనలు తెలిపిన జనార్దన్ యాదవ్ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.. భద్రతా విధానాలపై ఐరోపా యూనియన్ పునరాలోచన చేయాలని తేల్చిచెప్పిన ఈయూ నేత టెరెసా రిబెరా అహ్మదాబాద్‌లో రూ. 1,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీపావళి వేడుకల్లో ప్రియుడితో సందడి చేసిన కృతి సనన్.. బాలీవుడ్ ప్రముఖుల హాజరు అమెరికా న్యాయశాఖ సివిల్ డివిజన్ అధిపతి రాజీనామా అమెరికా సుప్రీంకోర్టులో దివంగత బేస్‌బాల్ దిగ్గజం రాబర్టో క్లెమెంట్ కుటుంబానికి చుక్కెదురు డైమండ్ దిగ్గజం డీ బీర్స్‌లో వాటాను 30 శాతానికి పెంచుకోనున్న బోత్వానా మైత్రీ మూవీ మేకర్స్ ‘DNK’ ట్రైలర్ విడుదల: ఫుల్ ఆన్‌లైన్ బెట్టింగ్ మానియాతో నవ్వులు పూయిస్తున్న ఎంటర్‌టైనర్ అమెజాన్ అడవుల పరిరక్షణకు భారీ ఆర్థిక సాయం మెడికల్ షాప్ లో తనిఖీ చేసిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కూటమిపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం గ్రామ పంచాయతీల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం కావాలి : ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

అయ్యవారిపల్లి అక్రమ భూ బదలాయింపుల ... ప్రజావాణిలో కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు

Select Suryaa Now
అయ్యవారిపల్లి అక్రమ భూ బదలాయింపుల ... ప్రజావాణిలో కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు


* సర్వే నంబర్ 115లో అక్రమంగా జరిగిన భూ బదలాయింపులపై చర్యలు తీసుకోవాలని వినతి
* భూమి యజమాని, ప్లాట్ల కొనుగోలుదారుల ఉమ్మడిగా వినతి
* ఇప్పటికే తహసీల్దార్, భూభారతి ఆపరేటర్లపై సస్పెన్షన్ వేటు
ఉప్పునుంతల, సూర్య న్యూస్:
ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 115లో అక్రమ భూ బదలాయింపుల వ్యవహారంపై బాధితులు మరోసారి అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు భూమి యజమాని వర్కల నాగరాజుతో పాటు ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రాను కూడా కలిసి తమ సమస్యలను వివరించారు. సర్వే నంబర్ 115లో అక్రమంగా పట్టాలు బదలాయింపు జరిగినట్లు ఆరోపిస్తూ, సంబంధిత అక్రమ పట్టాలను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అయ్యవారిపల్లి భూ బదలాయింపుల వ్యవహారంలో ఇప్పటికే విచారణ అనంతరం తహసీల్దార్‌తో పాటు భూభారతి ఆపరేటర్లను అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తమ భూములకు సంబంధించిన సమస్య పరిష్కారం కాలేదని బాధితులు పేర్కొంటూ, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు.