BREAKING
విజేత, కటకం కుమారస్వామిని అభినందించిన ఎమ్మెల్యే ఆనందబాబు టాలీవుడ్‌లో కొత్త క్రైండ్‌గా మారిన మలయాళ బ్యూటీ అన.. నేటి కుర్రకారును ఆకట్టుకుంటున్న వైనం ప్రజారోగ్యమే లక్ష్యంగా బస్తీ దవాఖానాలో అవగాహన కార్యక్రమం జడ్పిటిసి హర్షిత్ రెడ్డి కి అభినందనలు తెలిపిన జనార్దన్ యాదవ్ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.. భద్రతా విధానాలపై ఐరోపా యూనియన్ పునరాలోచన చేయాలని తేల్చిచెప్పిన ఈయూ నేత టెరెసా రిబెరా అహ్మదాబాద్‌లో రూ. 1,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీపావళి వేడుకల్లో ప్రియుడితో సందడి చేసిన కృతి సనన్.. బాలీవుడ్ ప్రముఖుల హాజరు అమెరికా న్యాయశాఖ సివిల్ డివిజన్ అధిపతి రాజీనామా అమెరికా సుప్రీంకోర్టులో దివంగత బేస్‌బాల్ దిగ్గజం రాబర్టో క్లెమెంట్ కుటుంబానికి చుక్కెదురు డైమండ్ దిగ్గజం డీ బీర్స్‌లో వాటాను 30 శాతానికి పెంచుకోనున్న బోత్వానా మైత్రీ మూవీ మేకర్స్ ‘DNK’ ట్రైలర్ విడుదల: ఫుల్ ఆన్‌లైన్ బెట్టింగ్ మానియాతో నవ్వులు పూయిస్తున్న ఎంటర్‌టైనర్ అమెజాన్ అడవుల పరిరక్షణకు భారీ ఆర్థిక సాయం మెడికల్ షాప్ లో తనిఖీ చేసిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కూటమిపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం గ్రామ పంచాయతీల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం కావాలి : ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

అయ్యప్ప భక్తుల కోసం ఉచిత భోజన వసతి (ప్రసాద వితరణ) ను ప్రారంభించిన స్వామి

Select Suryaa Now
అయ్యప్ప  భక్తుల కోసం ఉచిత భోజన వసతి (ప్రసాద వితరణ) ను  ప్రారంభించిన స్వామి

విజయనగరం మేజర్ న్యూస్, నవంబరు 9:

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సోమవారం విజయనగరంలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో 41 రోజుల అయ్యప్ప దీక్షను చేపట్టిన భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత భోజన వసతి (ప్రసాద వితరణ) కార్యక్రమాన్ని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ.. సుమారు 15 సంవత్సరాల క్రితమే నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలనే సంకల్పం కలిగిందని, ఆలయ కమిటీ సభ్యుల ప్రోత్సాహంతో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుండడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు, నిత్య అన్నదాన ట్రస్ట్ సభ్యులను అభినందించారు.

సరైన భోజన వసతులు అందుబాటులో లేక దీక్షలు చేపట్టలేని భక్తులకు ఈ 41 రోజుల ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. అయ్యప్ప మాల, భవాని మాల, శివ మాల ధరించిన భక్తులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం అనగానే నిత్య అన్నదాన కార్యక్రమానికి కేంద్ర బిందువుగా గుర్తింపు పొందడం ఆనందంగా ఉందన్నారు. విజయనగర పట్టణంలో నిర్వహించే దైవ కార్యక్రమాలకు, అన్నదాన కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. అదే విధంగా రానున్న రోజుల్లో నూతన తరం కూడా అన్నదాన ట్రస్ట్ కార్యక్రమాల్లో భాగస్వాములై సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పెంటపాటి కామరాజు, కంది మురళి నాయుడు, బండారి చంద్రశేఖర్, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ సభ్యులు, నిత్య అన్నదాన ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

శ్రీనివాస్ బ్యూరో విజయనగరం