శ్రీజ తండ్రిని పరామర్శించిన ఆర్డీఓ
ఫోటో: 1 శ్రీజ తండ్రి యాదగిరి రెడ్డి ని పరామర్శిస్తున్న ఆర్డీవో అశోక్ రెడ్డి
కనగల్ మేజర్ న్యూస్: శాబ్దుల్లాపురం గ్రామానికి దీపావళి పండుగ రోజు అయిన శనివారం చేరుకున్న నల్గొండ ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి శ్రీజ తండ్రి యాదగిరిరెడ్డిని పరామర్శించారు. శ్రీజ అదృశ్యానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. శ్రీజ క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. తనకు కూడా ఒక కూతురు ఉంటే అమెరికాకు పంపేవాడిని కాదని తండ్రి యాదగిరిరెడ్డితో అన్నట్లు అక్కడి వారు తెలిపారు. ఆ మాటలు అక్కడున్న వారిని కలచివేశాయి.
ఆయన వెంట జిల్లా కిసాన్ సెల్ కన్వీనర్ గోలి జగాల్ రెడ్డి, శాద్దులాపురం సర్పంచ్ తంగిరాల అంతయ్య ,మాజీ సర్పంచ్ దాసిరెడ్డి జ్యోతి, రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ కారింగు స్వామి, జిల్లా వెంకన్న, కాసర్ల మాధవరెడ్డి, మధుసూదన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, తంగిరాల ముత్తయ్య, నక్క శివ, గుత్త కృష్ణారెడ్డి, పోలోజు నాగచారి తదితరులు పాల్గొన్నారు.