కోడి పందాల స్థావరంపై వేంసూర్ పోలీసులు దాడి
8 మంది పందెం రాయుళ్లు అరెస్ట్.
సత్తుపల్లి మేజర్ సూర్య న్యూస్:
వేంసూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో కోడిపందాల స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. కోడి పందాలు నిర్వహిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 13 మోటార్ సైకిళ్లు, మూడు కోడిపుంజులు, రూ.3,100 నగదు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వేంసూరు మండలం చౌడవరం గ్రామ తండా సమీపంలోని రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు కోడిపందాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో వేంసూరు పోలీసుల బృందం దాడులు నిర్వహించింది. పందెం రాళ్లతో పాటు ఘటనా స్థలంలో లభించిన 13 మోటార్ సైకిళ్లు, మూడు కోడిపుంజులు, ఆరు సెల్‌ఫోన్లు, రూ.3,100 నగదును స్వాధీనం చేసుకుని వేంసూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు వేంసూరు ఎస్సై ప్రదీప్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ కోడిపందాలు, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందించే సహకరించాలని విజ్ఞప్తి చేశారు.