telangana
కొండగట్టు చందనోత్సవం - మహా సంప్రోక్షణ గోడపత్రులు, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం
సూర్య మల్యాల : కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 15 నుండి 20 తారీకు వరకు చందనోత్సవం - మహా సంప్రోక్షణ ను పురస్కరించుకొని, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం స్వామివారి సన్నిధిలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి చందనోత్సవానికి సంబంధించిన గోడపత్రులు ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం, ముఖ్యంగా దివ్యాంగ భక్తులకు ఆలయ ప్రాంగణంలో రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఎలక్ట్రికల్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ వాహనం కొనుగోలుకు దేవస్థానం తరఫున రూ.3 లక్షలు, దాతలైన మారుతి ఎస్.ఆర్. డైరీ, కరీంనగర్ వారి తరఫున రూ.2 లక్షలు, మొత్తం రూ.5 లక్షలు వెచ్చించడం జరిగింది అనంతరం హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కలిసి, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి చందనోత్సవానికి హాజరుకావాల్సిందిగా మర్యాదపూర్వకముగా ఆహ్వానించడం జరిగింది. కార్యనిర్వహణాధికారి అంజనా రెడ్డి , గ్రామ సర్పంచ్ ఆదిరెడ్డి, దేవస్థాన స్థానాచార్యులు కపిందర్, ఆలయ సూపరింటెండెంట్ సునీల్ కుమార్, బత్తిని శ్రీనివాస్, కమలాకర్ రెడ్డి ముత్యం శంకర్, రాజనర్సింగరావు, నక్క అనిల్, అజయ్ రెడ్డి మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.