మెకానిక్ వర్క్ షాప్ లో భారీ మంటలు 15 లక్షల ఆస్తి నష్టం
మెకానిక్ వర్క్ షాప్ లో భారీ మంటలు
15 లక్షల ఆస్తి నష్టం
బాధితున్ని పరామర్శించిన ఎంపీ రఘునందన్ రావు
కుకునూరుపల్లి, మేజర్ న్యూస్..... మండల కేంద్రమైన కుకునూరుపల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహ బైక్ మెకానిక్ వర్క్ షాప్ లో సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆకస్మికంగా భారీగా మంటలు వ్యాప్తి చెంది పూర్తిగా వర్క్ షాప్ దగ్నమైంది.అగ్నిమాపక సిబ్బంది సహాయంతో షాపులో మంటలను అదుపులోకి తెచ్చారు.విషయం తెలుసుకున్న ఎంపీ రఘునందన్ రావు షాపును పరిశీలించి షాప్ యజమాని బోనగిరి చందును పరామర్శించి ప్రమాదం గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా రాత్రి 11 గంటల వరకుషాపు వద్దనే ఉన్నా ఆకస్మికంగా మంటలులో షాప్ లో ఉన్న సామాగ్రి స్టోర్లో ఉన్న స్పేర్ పార్ట్స్ పూర్తిగా మంటల్లో కాలిపోవడంతో సుమారు15 లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఎంపీకి వివరించారు.చందు కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యంగా ఉండాలి జిల్లా కలెక్టర్ ద్వారా ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఆయన వెంట సదానంద గౌడ్ బోనాల రాజు గౌరారం కృష్ణ బిజెపి కార్యకర్తలు ఉన్నారు.