BREAKING
భారత రాజ్యాంగ దినోత్సవం పై విద్యార్థులకు పోటీలు. మండల "సూర్యకళ"ను అభినందించిన "బొత్స"... ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు ప్రమాదవశాత్తు మహిళ మృతి బాలికల సమీకృత వసతి గృహాన్ని జడ్జి ఆకస్మిక తనిఖీ పీసీసీ అధికార ప్రతినిధిగా సిరాజ్ హుస్సేన్ నియామకం ఆరికతోటలో నందె మ్మకు ఘనంగా పూజలు అయ్యప్ప భక్తుల కోసం ఉచిత భోజన వసతి (ప్రసాద వితరణ) ను ప్రారంభించిన స్వామి జడ్పి చైర్మన్ రేసులో డాక్టర్ సాధిక.. అయ్యవారిపల్లి అక్రమ భూ బదలాయింపుల ... ప్రజావాణిలో కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు పేద విద్యార్థిని చదువుకు మండవ ఫౌండేషన్ ఆర్థిక చేయూత కొత్త కొత్తూరు లో న్యాయసేవా దినోత్సవం సుమయా రెడ్డి ‘ప్రొడక్షన్ నెం. 2’ షురూ: డిఫరెంట్ జానర్‌లో మహారాణిలా పోస్టర్ లుక్ వత్సవాయి జడ్పీటీసీగా వడ్లమూడి రాంబాబుకు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి వెలుగులు

ప్రయాణికుల రద్దీపై ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ

Select Suryaa Now
ప్రయాణికుల రద్దీపై ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ
సూర్య కరీంనగర్ : దీపావళి పండుగ అనంతరం తిరుగు ప్రయాణాల నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ బస్ స్టేషన్, కరీంనగర్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి. రాజు స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన రూట్లలో తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని బస్ స్టేషన్ సూపర్వైజర్లు రామకృష్ణ, ఏ.వి.ఆర్. రెడ్డిలకు సూచించారు.ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల నిర్వహణ చేపట్టి, సురక్షితమైన ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు.

ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ బి. రాజుతో పాటు డిప్యూటీ రీజినల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎస్. భూపతిరెడ్డి, డిప్యూటీ రీజినల్ మేనేజర్ (మెకానికల్) పి. మల్లేశం, కరీంనగర్-1 డిపో మేనేజర్ విజయమాధురి పాల్గొన్నారు.