కరీంనగర్-1 డిపో నుంచి అరుణాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు
సూర్య కరీంనగర్ : భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్-1 డిపో ఆధ్వర్యంలో నవంబర్ నెలలో అరుణాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీమతి ఐ. విజయ మాధురి తెలిపారు.ఈ ప్రత్యేక బస్సు నవంబర్ 13వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్ బస్టాండ్ నుంచి బయలుదేరుతుంది. నవంబర్ 14న కాణిపాకం, కంచిలోని రెండు ఆలయాలను దర్శించుకున్న అనంతరం అదే రోజు రాత్రి అరుణాచలం చేరుకుంటుంది. అక్కడ గిరి ప్రదక్షిణ, స్వామివారి దర్శనం అనంతరం నవంబర్ 15వ తేదీ మధ్యాహ్నం అరుణాచలం నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. అనంతరం జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకుని నవంబర్ 16వ తేదీ సోమవారం సాయంత్రం వరకు కరీంనగర్ చేరుకుంటుంది.ఈ యాత్రకు పెద్దలకు రూ.5,000, పిల్లలకు రూ.3,750 టికెట్ ధరగా నిర్ణయించారు. భోజనం, ఇతర వ్యక్తిగత ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.మరిన్ని వివరాలు, టికెట్ల రిజర్వేషన్ కోసం 7382849352, 9959225920 నంబర్లను సంప్రదించాలని డిపో మేనేజర్ ఐ. విజయ మాధురి కోరారు.