BREAKING
భారత రాజ్యాంగ దినోత్సవం పై విద్యార్థులకు పోటీలు. మండల "సూర్యకళ"ను అభినందించిన "బొత్స"... ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు ప్రమాదవశాత్తు మహిళ మృతి బాలికల సమీకృత వసతి గృహాన్ని జడ్జి ఆకస్మిక తనిఖీ పీసీసీ అధికార ప్రతినిధిగా సిరాజ్ హుస్సేన్ నియామకం ఆరికతోటలో నందె మ్మకు ఘనంగా పూజలు అయ్యప్ప భక్తుల కోసం ఉచిత భోజన వసతి (ప్రసాద వితరణ) ను ప్రారంభించిన స్వామి జడ్పి చైర్మన్ రేసులో డాక్టర్ సాధిక.. అయ్యవారిపల్లి అక్రమ భూ బదలాయింపుల ... ప్రజావాణిలో కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు పేద విద్యార్థిని చదువుకు మండవ ఫౌండేషన్ ఆర్థిక చేయూత కొత్త కొత్తూరు లో న్యాయసేవా దినోత్సవం సుమయా రెడ్డి ‘ప్రొడక్షన్ నెం. 2’ షురూ: డిఫరెంట్ జానర్‌లో మహారాణిలా పోస్టర్ లుక్ వత్సవాయి జడ్పీటీసీగా వడ్లమూడి రాంబాబుకు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి వెలుగులు

పంట కుంటతో పల్లీ పంటకు నీటి తడి

Select Suryaa Now
పంట కుంటతో పల్లీ పంటకు నీటి తడి

నవాబుపేట సూర్య న్యూస్: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.అయినప్పటికీ నవాబుపేట గ్రామానికి చెందిన రైతు ద్యావని రాములు తన మూడు ఎకరాల పొలంలో వేరుశనగ (పల్లీ) సాగు చేపట్టి పంటను కాపాడుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు.పంట సాగు కోసం ఇప్పటివరకు సుమారు రూ.1.70లక్షలు ఖర్చు చేశాడు.తన పొలంలోనే పంట కుంటను ఏర్పాటు చేసుకుని అందులో నిల్వ చేసిన నీటిని స్ప్రింక్లర్ల ద్వారా పంటకు అందిస్తున్నాడు.వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఉదయం 3.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉండటంతో పొలంలోనే ఉంటూ నీటి తడులు అందిస్తున్నాడు.ఎండలు,వర్షాభావ పరిస్థితులను తట్టుకుంటూ కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటున్నాడు.పంట కుంట ఏర్పాటు చేసుకుని సాగునీటి ఇబ్బందులను అధిగమిస్తూ సాగు చేస్తున్న రాములు కృషి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది.