BREAKING
ప్రత్యేక ధరలకు నాణ్యమైన బియ్యం విక్రయాలు.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత వింతైన ఔట్.. అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్‌గా వెనుదిరిగిన కెప్టెన్! స్మోగ్ ముసుగులో ఉత్తర భారతం: నాసా శాటిలైట్ చిత్రాలు రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం ఈనెల 11న సర్దార్ నగర్ లో BJP జెండావిష్కరణ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ ఇందిరమ్మ ఇండ్లు గ్రామసభ ద్వారా ఎంపిక చేయాలి షాబాద్‌లో ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభం వ్యవసాయ భూమిలో మొసలి సంచారం.. గ్రామస్థుల్లో ఆందోళన! కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై హర్షం నిమ్మనపల్లికి హెల్త్ సెంటర్, సోలార్ లైట్లు, తాగునీటి బోర్లు మంజూరు చేయాలి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సర్పంచ్ వేల్పుల రమేష్ వినతి ఓటీటీలో సందడి చేస్తోన్న సందీప్ కిషన్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ప్రాజెక్ట్ జెడ్! కడప సుధాకర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న ఎంపిటిసి ధనలక్ష్మీ : కోటకాడపల్లి అభివృద్ధికి కృషిచేయాలని సూచించిన అప్ప ఉపాధి హామీ పనికి శ్రీకారం.

పత్తి కొనుగోళ్ళు  వెంటనే ప్రారంభించాలి - మాజీ మంత్రి జోగు రామన్న

Select Suryaa Now
పత్తి కొనుగోళ్ళు  వెంటనే ప్రారంభించాలి - మాజీ మంత్రి జోగు రామన్న
సూర్య  బేల : పత్తి పంట చేతికొచ్చి నెల రోజులు గడుస్తున్నప్పటికీ బేలలో ఇప్పటివరకు పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం శోచనీయమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.  సోమవారం  ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వెంటనే  బేల లో పత్తి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒకవైపు రైతులు తమ పంటను విక్రయించుకునేందుకు ఎదురుచూస్తుంటే, మరోవైపు  పత్తి దిగుమతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం  సుంకాన్ని పూర్తిగా తొలగించడం వల్ల  మార్కెట్లో పత్తి ధరలు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. 
  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి  పత్తికి గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో  మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్,మస్కే తేజరావు, సతీష్ పవర్, విపిన్ కోడె  నాయకులు తదితరులు పాల్గొన్నారు.